Breaking News
ఓటర్‌ నమోదు అవగాహన ర్యాలీలో పాల్గొన్న తహసీల్దార్‌

ఓటర్‌ నమోదు పై అవగాహన ర్యాలీ

రెంజల్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగులు ఓటరు నమోదు చేసుకోవాలని తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్‌వాడి కార్యకర్తలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నేటి నుండి 5వ తేదీ వరకు ఓటర్‌ నమోదు కోసం బీఎల్‌వోలు స్థానికంగా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారని వారి వద్ద నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు.

కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ ప్రమీల, అంగన్‌వాడి కార్యకర్తలు సురేఖ, అరుణ, రాణి, భాగ్యలక్ష్మి, జమున, గంగామణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *