Breaking News
బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న బిజెపి నాయకులు

బిజెవైఎం ఆద్వర్యంలో బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బిజెవైఎం ఆధ్వర్యంలో విజయలక్ష్యం 2019 మహా బైక్‌ ర్యాలీని నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌ బోరా ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు, బిజెపి నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడి తిరిగి దేశ ప్రధాని కావాలనే ఉద్దేశంతో నిర్వహించతలపెట్టిన విజయలక్ష్యం 2019 నిర్వహించడం జరుగుతుందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు హన్మంత్‌రెడ్డి, ఎల్లప్ప, భరత్‌ భూషణ్‌, బద్దం కిషన్‌, నరేశ్‌, ఆనంద్‌రెడ్డి, జశ్వంత్‌, సంగమేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *