Breaking News
సిసి ఫుటేజిని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఓటరు జాబితాలో లోపాలు ఉండకూడదు

నిజామాబాద్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో డూప్లికేట్‌, లాజిక్‌ ఎర్రర్స్‌, డబల్‌ నేమ్స్‌ ఒక్కటి కూడా ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఓటర్‌ నమోదు ప్రత్యేక శిబిరం పురస్కరించుకొని మొదటిరోజు శనివారం ఉదయం నగరంలోని అర్సపల్లి, హబీబ్‌ నగర్‌, నాగారం, మాలపల్లిలో పలు పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్దేశించిన ప్రకారం జిల్లాలో మార్చి 2, 3 తేదీలలో రెండు రోజులపాటు ప్రత్యేక ఓటర్‌ నమోదు శిబిరాలను జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలలో బిఎల్‌ఓలు సూపర్‌వైజర్లు ఓటర్‌ నమోదుతో పాటుగా డూప్లికేట్‌ లాజికల్‌ ఎర్రర్స్‌ డబల్‌ నేమ్స్‌ పరిశీలన చేసి ఓటర్‌ జాబితా నుండి తొలగిస్తారని ఈ పక్రియ ఏరోజుకు ఆరోజు పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ముందుగా మాలపల్లి దారుగల్లీ ఉర్దూ మీడియా పాఠశాలలో ఏర్పాటు చేసిన 174,176,177,180 194,195 పోలింగ్‌ కేంద్రాలకు కలెక్టర్‌ పరిశీలించారు. డూప్లికేట్‌, ఓటర్లు ఓటరు లిస్టులో శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని బిఎల్‌ఓలను ఆదేశించారు. అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 218, 220, 235,236 ,237, 238 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఫారం 6 దరఖాస్తులను పరిశీలన చేసిన తర్వాతనే అర్హత గల వారిని డూప్లికేట్‌ ఓటర్లను సాయంత్రం లోగా ఓటర్‌ జాబితా నుండి తొలగించాలని సూపర్వైజర్‌ను ఆదేశించారు. హబీబ్‌నగర్‌ సబ్జా కాలనీ కేంబ్రిడ్జ్‌ పాఠశాలలో 228, 221, 224, 225, 226, 220, 229 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలన డబల్‌ నేమ్స్‌ లాజికల్‌ ఎర్రర్స్‌ డూప్లికేట్‌ ఓటర్లను ఏమి లేకుండా సత్వరమే ఓటర్‌ జాబితా నుండి తొలగించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

బిఎల్‌వోలు అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అన్ని రకాల దివ్యాంగులను సర్వేచేసి అర్హులైన వారిని ఓటర్‌ జాబితాలో నమోదు చేయాలని ఆదేశించారు. ఓటు హక్కు లేని వారు సంబంధిత బిఎల్‌వో వద్ద గాని తహసిల్దార్‌ కార్యాలయానికి లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ వివరించారు. అంతకుముందు హైదరాబాద్‌ రోడ్డు బ్యాంక్‌ కాలనీలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రశ్నపత్రాలు ఓపెన్‌ చేసే సిసి పుటేజిని కలెక్టర్‌ పరిశీలించారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *