Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై శంకర్‌

ప్రజలు మూఢవిశ్వాసాలు నమ్మద్దు

రెంజల్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై శంకర్‌ అన్నారు. గురువారం రాత్రి రెంజల్‌లో పోలీసు కళాబందం ద్వారా మూఢ నమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మవద్దని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్న ప్రజలు మూఢనమ్మకలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని, ఒక్కో సీసీ కెమెరా 100 మందితో సమానమని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌, గ్రామస్థులు, కళాబందం కళాకారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *