Breaking News

తెలంగాణ తిరుమలలో భక్తుల సందడి

బీర్కూర్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం సందర్భంగా తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలయకమిటి ఛైర్మెన్‌ మురళి మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 16వ వరకు శ్రీవారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఐదు రోజులు అంకురార్పణ, ధ్వజారోహణ, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆలయ ధర్మకర్త శంబురెడ్డి, శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయంతం చేయాలనీ కోరారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *