Breaking News
ధ్వజస్తంభాన్ని ప్రతిష్టిస్తున్న దశ్యం

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలోని గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా, ఆలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేశారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కరణ్‌ రెడ్డి, లింగం, సాయిలు, లింగారెడ్డి, తదితరులు ఉన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *