Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న యెండల

6న ఇందూరుకు అమిత్‌ షా

నిజామాబాద్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 6న నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విచ్చేస్తున్నట్టు బిజెపి కేంద్ర కార్య వర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యెండల మాట్లాడుతూ

6న స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిజామాబాద్‌, అదిలాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల క్లస్టర్‌ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మీడియా సమావేశంలో నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి గారు, బస్వ లక్ష్మినర్సయ్య, టక్కర్‌ హన్మంతు రెడ్డి, ఎల్లప్ప, నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌, వెంకటేష్‌, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, స్వామి యాదవ్‌, సుగుణ, బాదం కిషన్‌, శ్రీనివాస్‌ శర్మ, మున్నేర్‌, రషీద్‌, నారాయణ యాదవ్‌, మచల్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *