Breaking News

Daily Archives: March 4, 2019

7న మహిళా దినోత్సవ కవితాగానం

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మహిమాన్విత మహిళ’ అనే అంశంపై కవితాగానం ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్‌ శిక్షక్‌, అల్లిమోహన్‌ రాజ్‌ తెలిపారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కవుల కవితాగానం, కవయిత్రులకు సన్మాన కార్యక్రమం ఉంటాయని, అధిక సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.

Read More »

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. గాండ్లపేట్‌, ధర్మోర, శెట్‌పల్లి, వడ్యాట్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల, ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయాలన్ని కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ ప్రతినిదులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి నిజామాబాద్‌ జిల్లా నుంచే ...

Read More »

మిషన్‌ భగీరథ గుంతలతో ప్రమాదాలు

నందిపేట్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పైపులైన్‌ కొరకు జేసిపి ద్వారా తవ్వుతున్న గుంతలు వెంటనే అదేరోజు పూడ్చాల్సింది పోయి వారాల తరబడి వదిలేసి ఇంకోచోట పనులు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రమాదాలు సంభవించి కాలు, చేతులు విరగొట్టుకున్న సంఘటనలు జరుగుతున్నాయి. రోడ్డుకు ఒకవైపు త్రవ్వాల్సి ఉండగా రోడ్డుకు మధ్యలోంచి ఇష్టం వచ్చినట్లు త్రవ్వుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ...

Read More »

శివపంచాక్షరీ స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ| నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ”న” కారాయ నమః శివాయ || 1 || మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ| మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై ”మ” కారాయ నమః శివాయ || 2 || శివాయ గౌరీ వదనాబ్జ బంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ | శ్రీ నీలకంఠాయ వషభధ్వజాయ తస్మై ”శి” కారాయ నమః శివాయ || 3 || వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ | ...

Read More »