Breaking News

Daily Archives: March 5, 2019

కోరిన కోర్కెలు తీర్చే అగ్గి దేవుడు మల్లన్న

నందిపేట్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరిన కోర్కెలు తీర్చే అగ్గి దేవుడు మల్లన్న అని మంగళవారం రొజు మహా శివరాత్రి సందర్భంగా నందిపేట్‌ మండలంలోని జీజీ నడుకుడా గ్రామంలో మల్లన్న ఆలయంలో శివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ బద్దం మధులిక రఘు మాట్లాడుతూ మంగళవారం మల్లన్న ఆలయంలో ఉదయం శివునికి హారతి, అభిషేకాలు నిర్వహించారని, శివనామ స్మరణతో మల్లన్న ఆలయం మారు మ్రోగిందన్నారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చుట్టూ పక్కల గ్రామాలైన ...

Read More »

దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లీనరీ లోపు 100 దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల బాధ్యురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంపి కవితను మహేశ్‌ బిగాల కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎన్‌ఆర్‌ఐ శాఖల ఏర్పాటు, శాఖల పనితీరు, కార్యకలాపాలపై ఎంపి కవిత చర్చించి పలు సూచనలు చేశారు. ఇటీవలే ఏర్పడిన కెనడా దేశం టీఆర్‌ఎస్‌ శాఖతో కలిపి ...

Read More »

అమిత్‌షా సభకు బందోబస్తు పర్యవేక్షణ

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 6వ తేదీ బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జిల్లా కేంద్రంలో క్లస్టర్‌ సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా భూమారెడ్డి కన్వెన్షన్‌ను పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో బందోబస్తుపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కమీషనర్‌ వెంట నిజామాబాద్‌ ఏసిపి, సిఆర్‌పిఎఫ్‌, పోలీసు బృందంతోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు శ్రీనివాసులు, బస్వ లక్ష్మినర్సయ్య, టక్కర్‌ ...

Read More »

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ నగర శివారులోని రాజారాం స్టేడియంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సమక్షంలో నిర్వహించారు. మూడవరోజు పరీక్షలకు వెయ్యి మంది పురుష అభ్యర్థులను పిలువగా 891 మంది హాజరైనట్టు కమీషనర్‌ తెలిపారు. ఎక్కడ మావన ప్రమేయం లేకుండా ఆర్‌ఎఫ్‌ఐడి ప్యాడ్‌లను ఉపయోగించడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ...

Read More »

ప్రధాని మోడి వల్లే దేశానికి గుర్తింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రదానమంత్రి నరేంద్రమోడి వల్ల దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ప్రాధాన్యత లభించిందని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తేదీ బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా క్లస్టర్‌ సమావేశంలో పాల్గొనడానికి నిజామాబాద్‌కు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. క్లస్టర్‌లోని పార్లమెంటు నియోజకవర్గాల బూత్‌ స్థాయి అధ్యక్షులు, జిల్లా పదాదికారులు, నగర, మండల, గ్రామ ఇన్‌చార్జిలు సమావేశంలో పాల్గొనాలని సూచించారు. మోడి ప్రభుత్వం ...

Read More »

జైరెడ్డిఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర పుణ్యక్షేత్రంలో పవిత్ర గోదావరి నది తీరాన అమర జవానులకు నివాళులు అర్పించి వారి అత్మకు శాంతి చేకూరాలని మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కార్యక్రమంలో వ్యస్థాపక అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు ఎడ్ల ఉప్పల్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పోరెడ్డి శాంతన్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సరసాని సురేందర్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, హోన్నజీపేట్‌ సురేందర్‌ రెడ్డి, రాజారెడ్డి, మహేందర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ప్రాధాన్యత అంశాల ప్రాతిపదికగా గ్రామాల్లో అభివద్ధి పనులు చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఏ పనులు నిర్వహించాలో వాటి ప్రాధాన్యతను గుర్తించి అభివద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా మూడవదశ కార్యక్రమాన్ని మంగళవారం డిచ్‌పల్లి టిటిడిసిలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వారా గ్రామాలను అభివద్ధి చేయడానికి ప్రాధాన్యత అంశాలను గుర్తించాలన్నారు. వాటిని పక్కాగా అమలు చేయడానికి శిక్షణను సర్పంచులు సద్వినియోగం ...

Read More »

మోర్తాడ్‌లో అన్నదానం

మోర్తాడ్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయాగ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం నుంచే ఆలయాల వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండలంలోని అత్యంత ప్రాచీనమైన రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు సోమవారం రాత్రి బస చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉపవాసాలు ఉన్న భక్తుల కోసం మంగళవారం ఉదయం అన్నదానం ఏర్పాటు చేసినట్టు గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు ...

Read More »

చిన్నారుల కుస్తీ…

బీర్కూర్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శివరాత్రి పర్వదినం వేడుకలలో భాగంగా మంగళవారం రోజు బీర్కూర్‌లోని కామప్ప వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. కుస్తీ పోటీలలో చిన్నారులు ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అవారి గంగారాం, యట వీరేశం, నారాయణ, యమా రాములు, పీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

స్వచ్ఛ గన్‌పూర్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్వచ్ఛ గన్‌పూర్‌లో భాగంగా గ్రామంలోని రజ సంఘం వద్ద ప్లాస్టిక్‌ కాగితాలు చెత్త, చెదారం, ముళ్లపొదలు శుభ్రం చేయడం జరిగింది. విపరీతంగా చెత్త పెరిగిపోవడంతో గాలి, దుమ్ముతో కూడి చెత్త పైకి లేస్తుంది. దీంతో వాయు కాలుష్యం అవుతుందని గమనించిన గ్రామ యువకులు స్వచ్చందంగా శుభ్రం చేశారు. ముళ్లపొదలను తొలగించడం జరిగింది. గత ఎనిమిది నెలలుగా ప్రతి మంగళవారం ఈవిధంగా స్వచ్చగన్‌పూర్‌లో భాగంగా గ్రామంలోని ఆయా కాలనీల్లో పరిశుభ్రతకు నడుం బిగించారు ...

Read More »