Breaking News

దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లీనరీ లోపు 100 దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల బాధ్యురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంపి కవితను మహేశ్‌ బిగాల కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎన్‌ఆర్‌ఐ శాఖల ఏర్పాటు, శాఖల పనితీరు, కార్యకలాపాలపై ఎంపి కవిత చర్చించి పలు సూచనలు చేశారు. ఇటీవలే ఏర్పడిన కెనడా దేశం టీఆర్‌ఎస్‌ శాఖతో కలిపి మొత్తం 40 దేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు ఏర్పాటయ్యాయని మహేష్‌ బిగాల ఎంపికి వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27 న జరిగే ప్లీనరీ నాటికి 100 దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయాలని ఎంపి కవిత కోరారు.

ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శాఖలు, గులాబీ జెండాలు రెపరెపలాడాలని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, పార్టీని విదేశాల్లోనూ బలపడెలా చూడడం మన బాధ్యత అని ఎంపి కవిత మహేశ్‌ బిగాలతో అన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. పరిపాలన, అభివద్ది, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ బాధ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా టిఆర్‌ఎస్‌ మిషన్‌లో భాగస్వాములై పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చెందుకు కషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ ఎన్నారై బాధ్యులను ప్రశంసిస్తూ, వారికి అభినందనలు తెలిపారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *