Breaking News

ప్రధాని మోడి వల్లే దేశానికి గుర్తింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రదానమంత్రి నరేంద్రమోడి వల్ల దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ప్రాధాన్యత లభించిందని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తేదీ బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా క్లస్టర్‌ సమావేశంలో పాల్గొనడానికి నిజామాబాద్‌కు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. క్లస్టర్‌లోని పార్లమెంటు నియోజకవర్గాల బూత్‌ స్థాయి అధ్యక్షులు, జిల్లా పదాదికారులు, నగర, మండల, గ్రామ ఇన్‌చార్జిలు సమావేశంలో పాల్గొనాలని సూచించారు.

మోడి ప్రభుత్వం వచ్చాక బలమైన దేశ నిర్మాణం, పేదల జీవితాల్లో మార్పు, అవినీతి రహిత పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. శ్రమించే తత్వం మోడికి చిన్ననాటి నుంచే ఉందని, మోడి విదేశీ పర్యటనల మూలంగా భారత్‌కు ఇతర దేశాల్లో ఎంతో ప్రాధాన్యత లభిస్తుందన్నారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తత నేపథ్యంలో చైనాతో సహా ప్రపంచ దేశాలన్ని భారత్‌కు మద్దతు ఇవ్వడం మోడి విదేశీ పర్యటనల వ్యూహంలో భాగమని అన్నారు. ప్రతిపక్షాలు పుల్వామాదాడిని రాజకీయం చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతూ భారత ఆర్మీని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *