Breaking News
పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ నగర శివారులోని రాజారాం స్టేడియంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సమక్షంలో నిర్వహించారు. మూడవరోజు పరీక్షలకు వెయ్యి మంది పురుష అభ్యర్థులను పిలువగా 891 మంది హాజరైనట్టు కమీషనర్‌ తెలిపారు. ఎక్కడ మావన ప్రమేయం లేకుండా ఆర్‌ఎఫ్‌ఐడి ప్యాడ్‌లను ఉపయోగించడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు కమీషనర్‌ పేర్కొన్నారు.

అభ్యర్థుల ఎత్తు, చాతి చుట్టుకొలతతో అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన వారికి కొంత సమయం విశ్రాంతి కల్పించి తదుపరి కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా తాగునీరు, ప్రథమ చికిత్స, మెడికల్‌ సిబ్బంది, అంబులెన్సు ఏర్పాటు చేసినట్టు కమీషనర్‌ తెలిపారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *