Breaking News

Daily Archives: March 6, 2019

ఇసుక తరలిస్తే చట్టరీత్యా నేరం

ఆర్మూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో గల వేల్పూర్‌ మోర్తాడ్‌ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీస్‌ శాఖ సిబ్బంది ఆర్టీవో అధికారికి అప్పగించారు. అనంతరం అసిస్టెంట్‌ రవాణా శాఖ అధికారి జయప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉపయోగించే ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే ఆర్టీవో చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రతి ట్రాక్టర్‌ను పరిశీలించి ట్రాక్టర్‌ డ్రైవర్‌ లైసెన్స్‌, సంబంధిత పత్రాలను పరిశీలించి వాహనానికి జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ...

Read More »

నేటి బాలికలే రేపటి మహిళలు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థినిలకు అవగాహన సదస్సు : మహిళ దినోత్సవం పురస్కరించుకుని ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ మహిళ విభాగం ఆధ్వర్యంలో బోర్గం ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థినులకు వారి సమస్యలపై, ఆశయాలపై, బాధ్యతలపై గురువారం అవగాహన సదస్సు, ఉల్లాస కార్యక్రమాలు నిర్వహించారు. గంట సేపు చర్చ వేదిక, అవగాహన కార్యక్రమం, మరో రెండు గంటల పాటు ఉల్లాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు ప్రెసిడెంట్‌ గౌరిశ్రీ, కార్యదర్శి సంధ్యారాణి, వైస్‌ ప్రెసిడెంట్‌ అనురాధ, ...

Read More »

తాడ్‌ బిలోలి లో మహిళా సదస్సు

రెంజల్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం (పీవోడబ్ల్యూ) ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సర్పంచులను సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే మహిళలు చైతన్య వంతులు అవుతారని పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి అన్నారు. మహిళలు సమాజాభివద్ధిలో పురుషులతో సమానంగా రాణించాలని అప్పుడే మహిళలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. జీవించే హక్కును హరిస్తున్న పితస్వామిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాడవలసిన అవసరముందని ...

Read More »

కేసీఆర్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్‌ విజయ కేసిఆర్‌ కిట్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆడపిల్లల సంరక్షణ కొరకు ప్రభుత్వాసుపత్రిలో ప్రమాదాలు జరుగుతూ కేసరి ద్వారా తల్లి బిడ్డకు సరిపడా సామాగ్రిని, నగదును అందజేయడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read More »

8న మహిళా దినోత్సవం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ విపంచి సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షురాలు తిరునగరి గిరిజా గాయత్రి తెలిపారు. జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులకు భారతీయ వారసత్వ సంపదలైన కళలలోని కొన్నింటిలో వర్లీ, మధుబని, కలంకారి, పాట్‌, గ్లాస్‌ పెయింటింగ్‌లో శిక్షణ, స్ఫూర్తి ప్రదాతలైన భారత మహిళల ఫోటో ప్రదర్శన ఉంటుందన్నారు. నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లి, శంకర్‌భవన్‌ పాఠశాలలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ...

Read More »

14న తెరాస పార్లమెంటరీ సమావేశం

నిజామాబాద్‌ ప్రతినిధి మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 వ తేదీన నిజామాబాద్‌ లో జరగనున్న టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంటరీ సమావేశం విజయవంతం చేసేందుకు బుధవారం హైదరాబాద్‌ లోని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత నివాసంలో సన్నాహక సమావేశం జరిగింది. ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు భిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, బోధన్‌, ఆర్మూర్‌, కోరుట్ల, ...

Read More »

కాదేదోయ్‌ పోటీకి అనర్హం…

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాదేదోయ్‌ కవిత కనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు…. కాదేదోయ్‌ పోటీకి అనర్హం అని నిరూపించాడు ఓ కుస్తీ వీరుడు. పోటీకి, విజయానికి అంగవైకల్యం అడ్డుకాదని చాటిచెప్పాడు….సంగం తండాలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో అంగ వైకల్యం తన విజయానికి అడ్డు లేదు అని నిరూపించుకున్నాడు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ధర్మాబాద్‌ తాలుకా, కరకెళ్లి గ్రామానికి చెందిన గణేష్‌. ఒంటి చేతితో కుస్తీ పోటీలో పాల్గొని విజయం సాధించాడు. నివ్వెరపోవడం ప్రేక్షకుల ...

Read More »