Breaking News

14న తెరాస పార్లమెంటరీ సమావేశం

నిజామాబాద్‌ ప్రతినిధి మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 వ తేదీన నిజామాబాద్‌ లో జరగనున్న టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంటరీ సమావేశం విజయవంతం చేసేందుకు బుధవారం హైదరాబాద్‌ లోని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత నివాసంలో సన్నాహక సమావేశం జరిగింది. ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు భిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, బోధన్‌, ఆర్మూర్‌, కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు షకీల్‌ ఆమిర్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, కె.విద్యాసాగర్‌ రావు, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ లతో పాటు ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, ఆకులలలిత, భానుప్రసాదరావులు సమావేశంలో పాల్గొన్నారు.

నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీ గ్రౌండ్‌ లో 14న జరగనున్న నిజామాబాద్‌ పార్లమెంటరీ సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు ప్రతి నియోజక వర్గానికి మూడు వేలకు పైగా సమావేశానికి హాజరవుతారని, 30 వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. వాహనాల పార్కింగ్‌, తాగునీరు, టాయిలెట్లు వంటి సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *