Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న గోదావరి

తాడ్‌ బిలోలి లో మహిళా సదస్సు

రెంజల్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం (పీవోడబ్ల్యూ) ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సర్పంచులను సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే మహిళలు చైతన్య వంతులు అవుతారని పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి అన్నారు.

మహిళలు సమాజాభివద్ధిలో పురుషులతో సమానంగా రాణించాలని అప్పుడే మహిళలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. జీవించే హక్కును హరిస్తున్న పితస్వామిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాడవలసిన అవసరముందని మహిళల తరపున పీవోడబ్ల్యూ ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి గంగాధర్‌ పార్వతి రాజేశ్వర్‌, నసీర్‌, ఒడ్డెన్న, నాగన్న, పెద్దులు తదితరులు ఉన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *