Breaking News
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎంఈఓ

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని ఎంఇఓ గణేష్‌ రావు అన్నారు. శుక్రవారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు కస్తూర్బా పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలురకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

అనంతరం ఎంఇఓ గణేష్‌ రావు మాట్లాడుతూ మహిళలు మున్ముందు మరింత అభివద్ధి చెంది మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో సమానంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మమత, ఉపాధ్యాయురాలు మమత, సీమ పర్వీన్‌, స్వప్న, పోసాని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *