Breaking News

నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో మందు

ఆర్మూర్‌, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌ బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ గ్రామ సర్పంచి బూస సునీత, బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ, మహాలక్ష్మి మందిరం వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి, అంబేద్కర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆదివారం సర్పంచి బూస సునీత-నరహరి పల్స్‌ పోలియో చుక్కల మందు వేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్‌ సునీతా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్స్‌ పోలియో కార్యక్రమాన్నీ ప్రవేశ పెట్టింది అని అన్నారు. రెండు చుక్కల పోలియో మందు నిండు జీవితాలు కాపాడుతాయని ఐదు సంవత్సరాల నిండిన పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కల మందు వేయుంచుకోని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో న్యాయవాది బూస నరహరి, ఉపసర్పంచి షేక్‌ వాహబ్‌, రైతు సమన్వయ సమితి బాల్కొండ మండల కో ఆర్డినేటర్‌ పుప్పాల విద్యా సాగర్‌, వార్డు సభ్యులు, సయ్యద్‌ రియాజ్‌ అలీ, పుప్పాల లావణ్య-సాగర్‌, బాద్గుణ రంజిత్‌ యాదవ్‌, సుజాత, శ్రీదేవి, అంగన్‌వాడి కార్యకర్తలు మూలుగు అనసూయ, పద్మావతీ, శ్రీదేవి, సునీత, ఆశా కార్యకర్తలు బోడ కష్ణవేణి. గంగమని, లక్ష్మీనర్సు, మంజూలా, రాధ, లావణ్య, గ్రేసు, మాధురి, లలితా తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *