Breaking News

Daily Archives: March 11, 2019

ఎంపి కవితకు రేషన్‌ డీలర్ల మద్దతు

బోధన్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ కవితకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎంపి తరపున ఎన్నికల్లో తాము ప్రచారం నిర్వహిస్తామని బోధన్‌ డివిజన్‌ మహిళా రేషన్‌ డీలర్లు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షురాలిగా వై.పద్మారెడ్డిని నియమిస్తున్నట్లు రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి వసంత ప్రకటించారు. అనంతరం ఎంపీ కవితకు మద్దతు తెలుపుతున్నట్లు సమావేశంలో తీర్మానించారు. రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎంపీగా కవితను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరముందన్నారు.

Read More »

యువకుల రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపదలో ఉన్న రోగులకు యువకులు రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలోని విపి ఠాకూర్‌ మెమోరియల్‌ బ్లడ్‌బ్యాంకులో తెరాస యువజన విబాగం పట్టణ నాయకులు వడ్ల అజయ్‌కుమార్‌, సాయిలు రక్తదానం చేశారు. రూబియా అనే మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం రక్తం అవసరం కాగా యువకులు రక్తదానం చేసి రోగిని ఆదుకున్నారు. కార్యక్రమంలో తెరాస యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్‌, నాయకులు భరత్‌, ప్రశాంత్‌, రిషికేశ్‌, ...

Read More »

పార్లమెంటు ఎన్నికల కోడ్‌అఫ్‌ కండక్ట్‌ను పక్కాగా అమలు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ లోక్‌సభ ఎన్నికల ప్రకటన నుంచి మాడల్‌ కోడ్‌అఫ్‌ కండక్ట్‌లో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల ఫోటోలు తొలగించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం జనహితలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేసి కోడ్‌ అఫ్‌ కండక్ట్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించారు. పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, పోటోలు వెంటనే తీసివేయాలని చెప్పారు. కోడ్‌ అమల్లో ఉన్నందున ...

Read More »

ప్రజావాణిలో 68 ఫిర్యాదులు

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 68 పిర్యాదులు అందినట్టు జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి తెలిపారు. రెవెన్యూ -52, వ్యవసాయ-4, ఎస్‌సి సంక్షేమ-1, ఎల్‌డిఎం -1, డిపివో-2, ఉపాధి శాఖ-1, విద్యుత్తు-1, ఆర్‌డబ్ల్యుఎస్‌-1, వైద్యం-2, మునిసిపల్‌-2, హోంశాఖ-1 సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Read More »

తెరాస సభ విజయవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న నిజాంసాగర్‌లో జరగనున్న బహిరంగ సభను తెరాస శ్రేణులు విజయవంతం చేయాలని తెరాస నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బహిరంగసభకు తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని, సభకు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెరాస నాయకులు పిప్పిరి వెంకటి, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, ...

Read More »

రైతుబజార్లను వినియోగంలోకి తేవాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైతు బజారును వెంటనే వినియోగంలోకి తీసుకోవాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. సోమవారం రైతు బజారును పరిశీలించిన వారు మాట్లాడారు. రైతుల ఇబ్బందులు పరిష్కరించాలని, 2017లో 50 లక్షలు వెచ్చించి ప్రభుత్వం రైతు బజారు నిర్మించిందన్నారు. కానీ రైతులకు అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం వహిస్తు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రైతు బజారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు. వెంటనే కలెక్టర్‌, అధికారులు ...

Read More »

పార్లమెంటు, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపిటిసి, జడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలని కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో సోమవారం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు సమయం లేదని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన ...

Read More »

సన్నాహక సమావేశానికి ముమ్మర ఏర్పాట్లు

బాన్సువాడ, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ చేపట్టిన సన్నాహాక సమావేశానికి జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్‌ వద్ద ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న బుధవారం నిర్వహించే సమావేశానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ విచ్చేయనుండడంతో స్థానిక నాయకులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మాగి వద్ద సభా స్థలిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ...

Read More »

ప్రశ్నించే వారికే పట్టం కట్టండి

రెంజల్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్థులైన వారికే పట్టం కట్టాలని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్‌ అన్నారు. పిఆర్‌టియు పక్షాన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూర రఘోత్తం రెడ్డికి మద్దతుగా రెంజల్‌ మండలంలోని పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరుగకుండా పోరాటం చేసిన రఘోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి ...

Read More »

వందశాతం చుక్కలు వేసేలా కృషి

బీర్కూర్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వందశాతం పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా కృషి చేస్తున్నామని డిప్యూటి డిఎంహెచ్‌వో రఘు అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయించని పిల్లలకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా డిప్యూటి డిఎంహెచ్‌వో రఘు మాట్లాడుతూ పోలియో చుక్కలను అప్పుడే పుట్టిన పిల్లలనుండి ఐదేళ్లలోపు ప్రతి పిల్లలకు వేయించాలని తల్లిదండ్రులకు సూచించామన్నారు. ఆయనవెంట హెచ్‌ఈవో ఇంతియాజ్‌, పల్స్‌పోలియో మెడికల్‌ ఆఫీసర్‌ రవిరాజ, ఆరోగ్య కార్యకర్తలు ...

Read More »

ప్రశ్నించే గొంతు లేకపోతే రాచరికం రాజ్యమేలుతుంది

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం పీ.హెచ్‌.డీ స్కాలర్‌, నిజామాబాద్‌ యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ ప్రెసిడెంట్‌ పంచారెడ్డి చరణ్‌ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా పంచారెడ్డి చరణ్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఎం.ఎల్‌.సి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆదరించాలని పిలుపునిచ్చారు. 1983లో తనరాజకీయ జీవితాన్ని ఆరంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఆరుసార్లు శాసనసభ్యుడిగా, తొలి తెలంగాణ శాసనసభలో జగిత్యాల శాసనసభ్యుడిగా, సి.ఎల్పీ ఉపనేతగా వై.యస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో ...

Read More »

కబ్జా కోరల్లో ఖాళీ స్థలాలు…

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో చాల చోట్ల వెంచర్లు చేసిన వారు కాలని వాసుల సౌకర్యం కోసం అంటే పార్కు లేదా ఆలయానికి వదిలేసి మిగిలిన ప్లాట్లు విక్రయిస్తారు. వాటి సంరక్షణ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు చూడాలి. అలా ప్రస్థుతం నగరంలో చాల స్థలాలు ఉన్నాయి. అందులో బాగంగా కంఠేశ్వర్‌ బైపాస్‌ నుండి అర్సపల్లి వెళ్లే మార్గంలో ఎంపి కవిత నివాసం వద్ద మూల మలుపు వద్ద ఎడమవైపు ఖాళీస్థలంలో మొరం పోసి ఓ కోఖా వేశారు. ...

Read More »

కొనసాగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం రాజారాం స్టేడియంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ అబ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు సోమవారంతో 7వ రోజుకు చేరాయి. నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సమక్షంలో ఉదయం 5 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7వ రోజు 937 మంది పురుష అభ్యర్థులను పిలువగా, అందులో 876 మంది హాజరైనట్టు కమీషనర్‌ తెలిపారు. ఎక్కడ మావన ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్‌ ద్వారా పర్షీలు నిర్వహించినట్టు తెలిపారు. అక్రమాలకు ...

Read More »

సాధన దీక్ష విజయవంతం చేయండి

నిజామాబాద్‌ మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక, ఓసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ వద్ద సాధన దీక్ష చేపడుతున్నట్లు రెడ్డిఐక్యవేదిక అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మన దేశంలోని ...

Read More »

ప్రశాంత ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17 వ లోకసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసినందున జిల్లాలో జరిగే నిజామాబాద్‌ లోక్‌ సభ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు కోరారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి తప్పనిసరిగా అందరూ అమలు చేయాలని కేంద్ర ...

Read More »

కరువు భత్యం పై ఉద్యమిద్దాం

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెయ్యి బీడీలకు పెరిగన కరువు భత్యం,రూ,4-80,ప్తె ”లు అమలుక్తె ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర బీడీ, సీగార్‌ అధ్యక్షుడు సిద్ధిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు కార్యాలయంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీడి కార్మికులు, కార్మిక సంఘాల ఐక్య పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడి కార్మికులకు కరువు భత్యం అగ్రిమెంట్‌ ప్రకారం 1994 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకోవడం జరిగిందని, అగ్రిమెంట్‌ ప్రకారం ప్రతి సంవత్సరం ...

Read More »

పోలియోకు ఎగనామం

ఆర్మూర్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం దేగాం పిఎస్‌సి పెర్కిట్‌ ఉపకేంద్రంలో పనిచేస్తున్న మెయిల్‌ వర్కర్‌ గణేష్‌ జాతీయ కార్యక్రమం అయినటువంటి పల్స్‌పోలియో కార్యక్రమానికి రెండో రోజు ఎగనామం పెట్టాడు. మామిడిపల్లి గ్రామంలోని పాండురంగ ట్రేడర్స్‌లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వ్యాక్సిన్‌ క్యారియర్‌తో దొరికిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గతంలో సైతం గిర్నీ లో గుమస్తాగా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో దేగాం పిఎస్‌సిలో పనిచేసిన వైద్యాధికారిని స్వాతివినూత్నపై దురుసుగా మాట్లాడడంతో ఆమె నిజామాబాద్‌ ...

Read More »