Breaking News
రక్తదానం చేస్తున్న యువకులు

యువకుల రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపదలో ఉన్న రోగులకు యువకులు రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలోని విపి ఠాకూర్‌ మెమోరియల్‌ బ్లడ్‌బ్యాంకులో తెరాస యువజన విబాగం పట్టణ నాయకులు వడ్ల అజయ్‌కుమార్‌, సాయిలు రక్తదానం చేశారు. రూబియా అనే మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం రక్తం అవసరం కాగా యువకులు రక్తదానం చేసి రోగిని ఆదుకున్నారు. కార్యక్రమంలో తెరాస యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్‌, నాయకులు భరత్‌, ప్రశాంత్‌, రిషికేశ్‌, కళ్యాణ్‌ తదితరులున్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *