Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ప్రశాంత ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17 వ లోకసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసినందున జిల్లాలో జరిగే నిజామాబాద్‌ లోక్‌ సభ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు కోరారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి తప్పనిసరిగా అందరూ అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాల ప్రకారం గా ఎన్నికలు నిర్వర్తించడం జరుగుతుందని ఈ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించి ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ కోరారు. అధికార పార్టీ ప్రతినిధులు ప్రభుత్వం రాజకీయ పార్టీలు అధికారులు ప్రజలందరికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారంగా నడుచుకోవాలని చెప్పారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంతంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, రీపోలింగ్‌ జరగకుండ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అందరి సమన్వయంతో ఇది సాధ్యమైందని చెప్పారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ప్రజలు, అధికారులు, పోలీసు యంత్రాంగం సహకారంతో అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడు జరగని విధంగా జరిగాయని ఇదే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్‌ ఎన్నికలు కూడా జరిగేందుకు తమ వంతు బాధ్యతగా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన ఆయన కోరారు. ఎన్నికల సందర్భంగా ఆయా అనుమతుల కోసం సువిధ అప్లికేషన్‌ ద్వారా 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని సింగిల్‌ విండో ద్వారా అన్ని అనుమతులు జారీ చేస్తారని కలెక్టర్‌ చెప్పారు. నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులు పాటించవలసిన అంశాలను ఎన్నికల నిబంధనల మేరకు పెట్టిన చర్యల గురించి కలెక్టర్‌ ఈ సందర్భంగా వారికి వివరించారు. సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులైన టిటి విపుల్‌ గౌడ్‌, ఈగ గంగారెడ్డి, కొమ్ము రాజమల్లు, లవంగ రాజు, బొడ్డు కిషన్‌, డాక్టర్‌ బి.ఆర్‌.గైస్క్వాడ్‌, రమేష్‌ బాబు, ఆజ్న బేగం తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *