Breaking News
సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు

సన్నాహక సమావేశానికి ముమ్మర ఏర్పాట్లు

బాన్సువాడ, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ చేపట్టిన సన్నాహాక సమావేశానికి జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్‌ వద్ద ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న బుధవారం నిర్వహించే సమావేశానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ విచ్చేయనుండడంతో స్థానిక నాయకులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు.

జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మాగి వద్ద సభా స్థలిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సోమవారం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయ్‌పేట్‌ సింగిల్‌ విండో అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, తదితరులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *