Breaking News
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కైలాస్‌ శ్రీనివాస్‌రావు

పార్లమెంటు, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

కామారెడ్డి, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపిటిసి, జడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలని కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో సోమవారం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం సమావేశంలో మాట్లాడారు.

స్థానిక ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు సమయం లేదని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్దిని, తెరాస హయాంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. అనంతరం నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లను సత్కరించారు. కార్యక్రమంలో జడ్పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ రత్నబాయి, ఆనంద్‌రావు, ఎంపిటిసి రాజాగౌడ్‌, ఉపసర్పంచ్‌ ఎల్లంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *