Breaking News

పోలియోకు ఎగనామం

ఆర్మూర్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం దేగాం పిఎస్‌సి పెర్కిట్‌ ఉపకేంద్రంలో పనిచేస్తున్న మెయిల్‌ వర్కర్‌ గణేష్‌ జాతీయ కార్యక్రమం అయినటువంటి పల్స్‌పోలియో కార్యక్రమానికి రెండో రోజు ఎగనామం పెట్టాడు. మామిడిపల్లి గ్రామంలోని పాండురంగ ట్రేడర్స్‌లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వ్యాక్సిన్‌ క్యారియర్‌తో దొరికిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గతంలో సైతం గిర్నీ లో గుమస్తాగా పని చేసిన సందర్భాలు ఉన్నాయి.

గతంలో దేగాం పిఎస్‌సిలో పనిచేసిన వైద్యాధికారిని స్వాతివినూత్నపై దురుసుగా మాట్లాడడంతో ఆమె నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రి హెల్ప్‌డెస్క్‌లో అతనికి డిప్యూటేషన్‌ వేశారు. గణేష్‌పై వైద్యాధికారిని వినూత్న పోలీస్‌ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్‌ షాపుల్లో గుమస్తాగా పనిచేయడం అతనికి దినచర్యగా మారింది. సంబంధిత అధికారులు గణేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Check Also

ఏఐఎస్‌ఎఫ్‌ రాస్తారోకో

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ అద్వర్యంలో ఎలారెడ్డి మండల కేంద్రంలో ప్రేవేట్‌ యూనివర్సిటీలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *