Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న రెడ్డి సంఘం ప్రతినిధులు

సాధన దీక్ష విజయవంతం చేయండి

నిజామాబాద్‌ మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక, ఓసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ వద్ద సాధన దీక్ష చేపడుతున్నట్లు రెడ్డిఐక్యవేదిక అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మన దేశంలోని 19 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ, ఆయా ప్రభుత్వాలునిర్ణయం తీసుకోగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహించడం సముచితం కాదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిపెస్టో లో పొందుపరిచిన విధంగా రాష్రంలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌ సత్వరమే ఏర్పాటు చేయాలనీ, ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి రైతుకు 5 లక్షల ఆరోగ్య భీమా కల్పించాలని ఆయన కోరారు.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు 14 పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని అగ్రకులాల వర్గాల ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా సహాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత 2014లో ఢిల్లీలో జరిగిన పసుపు రైతుల ధర్నాలో ప్రస్తుత కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టే సాధన దీక్షకు జిల్లాలోని అన్ని గ్రామాలనుండి అధిక సంఖ్యలో రెడ్డి బంధువులు, వైశ్య బంధువులు పాల్గొవాలని కోరారు. సమావేశంలో రెడ్డి స్టూడెంట్‌ విభాగం జిల్లా అధ్యక్షులు మనోజ్‌ రెడ్డి, రెడ్డి ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి అంతరెడ్డి సుదర్శన్‌ రెడ్డి, జిల్లా నాయకులు నర్సారెడ్డి, సంగమేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *