Breaking News
పరీక్షల తీరును పర్యవేక్షిస్తున్న సిపి

కొనసాగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం రాజారాం స్టేడియంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ అబ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు సోమవారంతో 7వ రోజుకు చేరాయి. నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సమక్షంలో ఉదయం 5 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7వ రోజు 937 మంది పురుష అభ్యర్థులను పిలువగా, అందులో 876 మంది హాజరైనట్టు కమీషనర్‌ తెలిపారు. ఎక్కడ మావన ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్‌ ద్వారా పర్షీలు నిర్వహించినట్టు తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో పరీక్షలు నిర్వహిస్తున్నామని కమీషనర్‌ వెల్లడించారు. పలుచోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎత్తు, ఛాతి, చుట్టుకొలతలో అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్‌ నిర్వహించామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మైదానంలో టిఫిన్‌ సెంటర్‌, తాగునీరు, మెడికల్‌ బృందాలను, అంబులెన్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచన మేరకు పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థుల ప్రదర్శనలకు సంబంధించిన ఫలితాల స్కోరు షీటును రిజిస్ట్రేషన్‌ నెంబర్ల ద్వారా వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమీషనర్‌ సూచించారు. ఎంపిక ప్రక్రియ సమయంలో ట్రెయినీ ఐపిఎస్‌ అధికారి గౌస్‌ అలమ్‌, కామారెడ్డి జిల్లా అదనపు ఎస్‌పి అన్యోన్య, ఆర్మూర్‌, బోధన్‌ ఎస్‌ఐ -బి, ఏఆర్‌, ట్రాఫిక్‌, సిసిఎస్‌, ఏసిపిలు రాములు, రఘు, రాజారత్నం, ఎస్‌హెచ్‌వో మహేశ్వర్‌, ప్రభాకర్‌రావు, స్వామి, సత్యకుమార్‌, అన్ని సబ్‌ డివిజన్‌ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, మహ్మద్‌ మక్బూల్‌ హైమద్‌, జనార్ధన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు, స్టాఫ్‌ ఇన్‌చార్జి వంశీ, చక్రవర్తి, రిజర్వు ఇన్స్‌పెక్టర్‌లు, ఫిజికల్‌ డైరెక్టర్‌లు, చంద్రప్రకాశ్‌, స్వప్న, మెడికల్‌ టీం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *