Breaking News
మాట్లాడుతున్న తెరాస నాయకులు

తెరాస సభ విజయవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న నిజాంసాగర్‌లో జరగనున్న బహిరంగ సభను తెరాస శ్రేణులు విజయవంతం చేయాలని తెరాస నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బహిరంగసభకు తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని, సభకు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెరాస నాయకులు పిప్పిరి వెంకటి, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్‌, రవి, నాయకులు జూలూరి సుధాకర్‌, లక్ష్మి నారాయణ, భూమేశ్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *