Breaking News
కరపత్రాలు విడుదల చేస్తున్న పిఆర్‌టియు నాయకులు

ప్రశ్నించే వారికే పట్టం కట్టండి

రెంజల్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్థులైన వారికే పట్టం కట్టాలని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్‌ అన్నారు. పిఆర్‌టియు పక్షాన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూర రఘోత్తం రెడ్డికి మద్దతుగా రెంజల్‌ మండలంలోని పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ. నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరుగకుండా పోరాటం చేసిన రఘోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి భారీమెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్‌టియు అన్ని రకాలుగా ముందుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పిఆర్‌టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌ సింగ్‌, మండల కార్యదర్శి భూమయ్య, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అబ్బయ్య, అక్తర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *