Breaking News

Daily Archives: March 12, 2019

అక్రమంగా ఏర్పాటుచేసిన కోక తొలగింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యూస్‌ ఎఫెక్ట్‌ కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డుపై అక్రమంగా వెలిసిన కొకను మున్సిపల్‌ అధికారులు మంగళవారం తొలగించారు. ఈ అంశంపై సోమవారం నిజామాబాద్‌ న్యూస్‌ ”కబ్జా కోరల్లోకి ఖాళీ స్థలాలు” అంటు కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మున్సిపల్‌ అధికారులు మంగళవారం జేసీబీ సహాయంతో అక్రమంగా వెలిసిన కొకను తొలగించారు. ”కబ్జా కోరల్లో” ఖాళీస్థలాలు అంటు నిజామాబాద్‌ న్యూస్‌ సోమవారం కథనాన్ని ప్రచురించింది. కథనానికి స్పందించిన మున్సిపల్‌ అధికారులు మంగళవారం ...

Read More »

మీరే నాయకత్వం వహించాలి

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా మీరే కొనసాగాలని సంఘం నాయకులు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను కోరుతున్నారు. ఈ నెల 9న శ్రీరాంపూర్‌లో జరిగిన టిబిజికెఎస్‌ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ (సి.డబ్లు.సి) ఎంపి కవితని గౌరవాధ్యక్షురాలుగా కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానం ప్రతిని టీబీజీకేఎస్‌ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మంగళవారం హైదరాబాదులో ఎంపి కవిత ను కలిసి అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంఘం గౌరవాధ్యక్ష ...

Read More »

కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపిగా కల్వకుంట్ల కవిత బారీ మెజార్టీ సాధించి దేశంలోనే మెజార్టీ రికార్డు సాధిస్తారని, జిల్లా రజకులందరు తెరాస పార్టీ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవితకు పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానించారు. ఈ మేరకు గూపన్‌పల్లిలోని దీపక్‌గార్డెన్‌లో నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక సర్వసభ్యసమావేశం గూపన్‌పల్లి శంకర్‌ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు, తెరాస నాయకుడు మానస గణేశ్‌ మాట్లాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ పేదలకు, ...

Read More »

మహాసభకు తరలిన నాయకులు

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మంగళవారం రాష్ట్ర సభలకు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర రెండో మహాసభలకు కామారెడ్డి నుంచి యూనియన్‌ నాయకులు వెళ్లారు. సభల్లో మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయస్‌, వర్కర్స్‌ సమస్యలు, డిమాండ్లు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్‌ను కలిసి సమస్యలపై చర్చించినట్టు పేర్కొన్నారు.

Read More »

విద్యావ్యాపారాన్ని పట్టించుకోని అధికారులు

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జరుగుతున్న ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల వ్యాపారాన్ని విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ముదాం ప్రవీణ్‌ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పరీక్షా సమయం దగ్గర పడడంతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హాల్‌ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖాధికారులు స్పందించని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Read More »

పది పరీక్షల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో సంబందిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డాక్టర్‌ జనార్ధన్‌రెడ్డి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. షషష.పరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ ద్వారా అభ్యర్థులు ...

Read More »

ఎంపి కవితకు గాండ్ల సంఘం మద్దతు

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలుగా తెరాస తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు గాండ్ల సంఘం పట్టణ అధ్యక్షుడు కూతురు అశోక్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం గాండ్ల కులస్తులను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ముద్దు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గాండ్ల కులస్తులను గుర్తించి, ...

Read More »

ప్రతి గ్రామాన్ని మాడల్‌ గ్రామంగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సర్పంచ్‌ తమ గ్రామాన్ని మాడల్‌ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేలా కష్టపడి పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను కోరారు. మంగళవారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో ఐదవ విడత కింద తాడ్వాయి, ఎల్లారెడ్డి, సదాశివనగర్‌, రామారెడ్డి మండలాలలోని 92 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ సర్పంచ్‌ తమవిధులు బాధ్యతల పట్ల అవగాహన ...

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట చర్యలు

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న జరగనున్న ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామారెడ్డి జనహిత భవనంలో జోనల్‌ అధికారులు, పివో, ఏపివోలకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 30 పోలింగ్‌ లొకేషన్‌లను ఏర్పాటు చేశామని, వీటిలో 20 కామన్‌ పోలింగ్‌ కేంద్రాలు, 2 ఉపాధ్యాయులకు ...

Read More »

సన్నాహాక సభకు ఏర్పాట్లు పరిశీలన

నిజాంసాగర్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామంలో తలపెట్టిన జహీరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు మంగళవారం సభాస్థలిని, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణ ఖేడ్‌, ఆందోళ్‌, జహీరాబాద్‌ నుంచి కార్యకర్తలు భారీగా ...

Read More »

ప్లేట్ల పంపిణీ అభినందనీయం

రెంజల్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ప్లేట్లను అందజేయడం అభినందనీయమని సర్పంచ్‌ లలిత, ఎంఇవో గణేవ్‌రావు అన్నారు. మండలంలోని నీలా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ తండ్రి గైని గంగారాం జ్ఞాపకార్థం మంగళవారం విద్యార్థులకు ఉచితంగా 250 ప్లేట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి విద్యార్థులకు పలు రకాలుగా ప్రోత్సాహకాన్ని అందిస్తు తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం బహుమతులు అందజేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ, పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు ...

Read More »

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆద్వర్యంలో గ్రామ సర్పంచ్‌ లలితను మంగళవారం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్దికి సహకరించాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ పాఠశాల అభివృద్దికి ఎల్లవేళలా సహాయసహకారాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ, పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు సోమలింగం, సాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌సింగ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, పోసాని, అనిల్‌ తదితరులున్నారు.

Read More »

8వ రోజు దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో నాగారం స్టేడియంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో 8వ రోజుకు చేరినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. మంగళవారం వెయ్యి మంది అభ్యర్థులకుగాను 872 మంది హాజరైనట్టు ఆయన తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సి ఐడెంటిఫికేషన్‌ రీడర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కమీషనర్‌ తెలిపారు. ఉదయం ...

Read More »

బోగస్‌ ఓట్లను తొలగించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న లక్ష 27 వేల బోగస్‌ ఓట్లను తొలగించాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు సర్వేలు చేసి ఓటర్ల నమోదు చేపట్టారని, గల్లంతైన ఓటర్ల పేర్లను నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన కోరారు. తప్పుడు సర్వేతో నిర్వహించిన బోగస్‌ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రభుత్వం తక్షణమే చెప్పాలని ...

Read More »

13న రామరాజ్య రథయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13న జిల్లా కేంద్రంలో రామరాజ్య రథయాత్ర నిర్వహిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు పోల్కం గంగాకిషన్‌ అన్నారు. శ్రీరామదాస మిషన్‌ యూనివర్సల్‌ సొసైటీ ఆద్వర్యంలో శ్రీశక్తి శాంతానంద మహర్షి నేతృత్వంలో రామరాజ్య రథయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాశివరాత్రి నాడు రామేశ్వరంలో ప్రారంభమై వివిద రాష్ట్రాల నుంచి ప్రయాణించి శ్రీరామనవమి రోజు రథయాత్ర అయోధ్య చేరుతుందని తెలిపారు. యాత్రలో భాగంగా ఉదయం 10 ...

Read More »

18, 19 తేదీల్లో రాష్ట్ర మహాసభలు

ఆర్మూర్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 18,19 తేదీలలో ఏఐటీయూసి 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి వేలాదిగా కార్మికులు తరలిరావాలని ఏఐటియుసి జిల్లాకార్యదర్శి సాయిలు అన్నారు. ఆర్మూర్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల, వర్కర్స్ల యూనియన్‌ ఆద్యర్యంలో గోడప్రతులు ఆవిష్కరించారు. అనంతరం సాయిలు మాట్లాడుతూ యూనియన్‌ ఏర్పడ్డ తరువాత ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, ఉద్యమాలు చేసిన చరిత్ర మన యూనియన్‌ కు ఉందని, ట్రాఫిక్‌ పోలీసులు ఈ చలాన్‌ పేరిట ...

Read More »

మానవత్వం పరిమళించిన మంచి మనసు

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం… అని సినీ గేయం… పై చిత్రాన్ని చూస్తుంటే ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. ఎవరో తెలియదు గానీ రహదారి గుండా వెళుతుంటే కోతుల గుంపు కనిపించడంతో వాటి దాహార్తిని తీరుస్తున్నాడు. సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటుంది. అలాగే నిజామాబాద్‌న్యూస్‌ మనసును కూడా చూరగొంది.

Read More »

బిఎస్‌పి జిల్లా అధ్యక్షునిగా మహతి రమేష్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బిఎస్‌పి అధ్యక్షుడిగా మహతి రమేష్‌ను నియమించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో జరిగిన బిఎస్‌పి కార్యవర్గ సమావేశంలో మహతి రమేష్‌ను నిజామాబాద్‌ అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య మహతి రమేష్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రస్థాయిలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ సందర్భంగా మహతి రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కలుపుకొని, అందరిని ఏకతాటిపైకి ...

Read More »