Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న గాండ్ల సంఘం ప్రతినిధులు

ఎంపి కవితకు గాండ్ల సంఘం మద్దతు

నిజామాబాద్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలుగా తెరాస తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు గాండ్ల సంఘం పట్టణ అధ్యక్షుడు కూతురు అశోక్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.

గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం గాండ్ల కులస్తులను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ముద్దు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గాండ్ల కులస్తులను గుర్తించి, తమను సామాజిక, ఆర్థిక అభివృద్ది కొరకు తోడ్పడ్డారని, అఖిల గాండ్లకుల సంఘ అభ్యర్థన మేరకు రాష్ట్ర రాజధానిలో గత సంవత్సరం ఎకరం స్థలం కేటాయించారని అందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎంపి కవితకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

సమావేశంలో గాండ్ల కుల సంఘ ప్రతినిధులు అశోక్‌, నాగరాజు, గిరిబాబు, రాజేశ్‌, మోహన్‌, పోశెట్టి, గంగాధర్‌, మహేందర్‌, కిషన్‌ తదితరులున్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *