Breaking News

మీరే నాయకత్వం వహించాలి

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా మీరే కొనసాగాలని సంఘం నాయకులు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను కోరుతున్నారు. ఈ నెల 9న శ్రీరాంపూర్‌లో జరిగిన టిబిజికెఎస్‌ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ (సి.డబ్లు.సి) ఎంపి కవితని గౌరవాధ్యక్షురాలుగా కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానం ప్రతిని టీబీజీకేఎస్‌ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మంగళవారం హైదరాబాదులో ఎంపి కవిత ను కలిసి అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంఘం గౌరవాధ్యక్ష పదవికి తమరు చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారని వెంకట్రావు, రాజిరెడ్డిలు ఎంపి కవితకు తెలిపారు. తమ నాయకత్వమే సింగరేణి కార్మికులకు శ్రీరామరక్ష అని భావిస్తున్నామని వారు చెప్పారు. కార్మిక సంక్షేమంతో పాటు సింగరేణి సంస్థ లాభాలబాట పయనించడానికి తమ సలహాలు, సూచనలు కారణమని వారన్నారు.

కోల్‌ ఇండియా తరహా బేసిక్‌ సాలరీపై ఒక శాతం విద్యుత్‌ చార్జీల రికవరీ చేసే విధానాన్ని మీరు నిలిపివేయించారు. వత్తి పన్నును అసెంబ్లీ తీర్మానం ద్వారా శాశ్వతంగా రద్దు చేయించారు. అండర్‌ గ్రౌండ్‌లో అన్‌ ఫిట్‌ అయిన కార్మికులకు సర్ఫెస్‌లలో తగిన పనిచేసేందుకు వీలు కల్పిస్తూ వారికి వేతనం తగ్గకుండా చూశారని చెప్పారు. గహనిర్మాణం కోసం బ్యాంక్‌లో తీసుకున్న రూ.10 లక్షలకు వడ్డీనీ యాజమాన్యం చెల్లించేలా ఒప్పందం చేయించారని, మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ చేయిస్తూ కార్మికుల కుటుంబీకులకు అండగా నిలుస్తున్నారని వారు తెలిపారు. కార్మికుల క్వార్టర్లుకు ఉచితంగా ఏసి సౌకర్యం, లాభాల్లో వాటా పెంపు, బకాయిలతో సహావత్తి పన్ను చెల్లింపు నిలిపివేత, మ్యాచింగ్‌ గ్రాంట్‌, సకల జనుల సమ్మె కాలం పూర్తి వేతనం చెల్లింపు, తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించడంలో తమ కషి ఉందని టిబిజికేఎస్‌ నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డిలు ఎంపి కవిత తో అన్నారు. సంఘం నేతల మనోగతాన్ని పార్టీ అధినాయకత్వం దష్టికి తీసుకు వెళతానని, వారి నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని ఎంపి కవిత టిబిజికేఎస్‌ నేతలకు తెలిపారు. సంఘానికి, కార్మికులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *