Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న పల్లెగంగారెడ్డి

బోగస్‌ ఓట్లను తొలగించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న లక్ష 27 వేల బోగస్‌ ఓట్లను తొలగించాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు సర్వేలు చేసి ఓటర్ల నమోదు చేపట్టారని, గల్లంతైన ఓటర్ల పేర్లను నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన కోరారు. తప్పుడు సర్వేతో నిర్వహించిన బోగస్‌ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రభుత్వం తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఒకరిపేరుతో రెండు ఓట్లు ఇవ్వడం సరైంది కాదన్నారు. స్థిరనివాసం ఉంటున్నవారి పేర్లు గల్లంతు చేయడం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. లక్ష 27 వేల బోగస్‌ ఓట్లపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్‌, పార్టీ సభ్యులతో కలిసి కలెక్టర్‌కు, ఆర్డీవోకు వినతి పత్రం అందించి వివరించామని తెలిపారు. నిజామాబాద్‌ అర్బన్‌లో 47 వేల బోగస్‌ ఓట్లు ఉన్నాయన్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఓట్లను ఉంచి మిగతా ఓటర్లను జాబితా నుంచి గల్లంతు చేయడం వారికే చెల్లిందని ఆరోపించారు.

ఈ అంశంపై జిల్లా యంత్రాంగం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నగరంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తప్పుడు జాబితా ఉందన్నారు. ఎన్నికలకు ముందు తెరాస ప్రబుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 90 సీట్లు గెలుస్తామని అనడం బోగస్‌ ఓట్లతోనే సాద్యమైందని ఆరోపించారు. ఇకనైనా సమగ్ర సర్వే నిర్వహించి గల్లంతైన ఓట్లను నమోదు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో బస్వాలక్ష్మినర్సయ్య, వెంకటేశ్‌, స్వామి యాదవ్‌, న్యాలంరాజు, లింగం, భరత్‌భూషణ్‌, శ్రీనివాస్‌ శర్మ, సుధీర్‌, బంటు రాము, నాయకులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *