Breaking News
నియామకపత్రం అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు

బిఎస్‌పి జిల్లా అధ్యక్షునిగా మహతి రమేష్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బిఎస్‌పి అధ్యక్షుడిగా మహతి రమేష్‌ను నియమించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో జరిగిన బిఎస్‌పి కార్యవర్గ సమావేశంలో మహతి రమేష్‌ను నిజామాబాద్‌ అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య మహతి రమేష్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రస్థాయిలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ సందర్భంగా మహతి రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కలుపుకొని, అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి రానున్న రోజుల్లో బీఎస్‌పి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలువురు మహతి రమేష్‌ను అభినందించారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *