Breaking News
పరీక్షలతీరును పర్యవేక్షిస్తున్న పోలీసు కమీషనర్‌

8వ రోజు దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో నాగారం స్టేడియంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో 8వ రోజుకు చేరినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. మంగళవారం వెయ్యి మంది అభ్యర్థులకుగాను 872 మంది హాజరైనట్టు ఆయన తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సి ఐడెంటిఫికేషన్‌ రీడర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కమీషనర్‌ తెలిపారు.

ఉదయం నుంచి అభ్యర్థులకు ఎత్తు, ఛాతి చుట్టుకొలతతో అర్హత ఉన్నవారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్‌ నిర్వహించామన్నారు. నిజామాబాద్‌ అదనపు డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి, ట్రెయినీ ఐపిఎస్‌ అదికారి గౌస్‌ అలం, కామారెడ్డి జిల్లా అదనపు ఎస్‌పి అన్యోన్య, ఆర్మూర్‌, బోధన్‌ ఎన్‌ఐబి, ఏఆర్‌, ట్రాఫిక్‌, సిసిఎస్‌, ఏసిపిలు రాములు, రఘు, రాజారత్నం, మహేశ్వర్‌, ఇతర సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *