Breaking News
విద్యార్థులకు ప్లేట్లు అందజేస్తున్న సర్పంచ్‌ లలిత

ప్లేట్ల పంపిణీ అభినందనీయం

రెంజల్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ప్లేట్లను అందజేయడం అభినందనీయమని సర్పంచ్‌ లలిత, ఎంఇవో గణేవ్‌రావు అన్నారు. మండలంలోని నీలా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ తండ్రి గైని గంగారాం జ్ఞాపకార్థం మంగళవారం విద్యార్థులకు ఉచితంగా 250 ప్లేట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి విద్యార్థులకు పలు రకాలుగా ప్రోత్సాహకాన్ని అందిస్తు తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం బహుమతులు అందజేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ, పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు సోమలింగం, సాయారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌సింగ్‌, విద్య కమిటీ అధ్యక్షుడు నసీర్‌, ఉపాధ్యాయులు పోసాని, అనిల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *