Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న మానస గణేశ్‌

కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపిగా కల్వకుంట్ల కవిత బారీ మెజార్టీ సాధించి దేశంలోనే మెజార్టీ రికార్డు సాధిస్తారని, జిల్లా రజకులందరు తెరాస పార్టీ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవితకు పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానించారు. ఈ మేరకు గూపన్‌పల్లిలోని దీపక్‌గార్డెన్‌లో నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక సర్వసభ్యసమావేశం గూపన్‌పల్లి శంకర్‌ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు, తెరాస నాయకుడు మానస గణేశ్‌ మాట్లాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ పేదలకు, రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందాలంటే కేంద్రంలో కెసిఆర్‌ పాత్ర కీలకం కావాలని, అందుకే తెలంగాణలోని 16 ఎంపి స్థానాలు తెరాసకు దక్కాలని అన్నారు.

రజకులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని, ఇచ్చిన హామీల్లో కొన్నింటిని తక్కువ సమయంలోనే నెరవేర్చారని, మిగతావి కూడా నెరవేరుస్తారనే నమ్మకంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సాయిలు, కోశాధికారి శంకర్‌, సమన్వయకర్త మల్లయ్య, మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కార్యదర్శి తులసి, పట్టణ అధ్యక్షుడు నాని, శ్యాంసింగ్‌, రాంచందర్‌, గంగాధర్‌, వినోద్‌, దేవయ్య, శైలేందర్‌, సవిత, ఆయా మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *