Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న పోల్కం గంగాకిషన్‌

13న రామరాజ్య రథయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13న జిల్లా కేంద్రంలో రామరాజ్య రథయాత్ర నిర్వహిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు పోల్కం గంగాకిషన్‌ అన్నారు. శ్రీరామదాస మిషన్‌ యూనివర్సల్‌ సొసైటీ ఆద్వర్యంలో శ్రీశక్తి శాంతానంద మహర్షి నేతృత్వంలో రామరాజ్య రథయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాశివరాత్రి నాడు రామేశ్వరంలో ప్రారంభమై వివిద రాష్ట్రాల నుంచి ప్రయాణించి శ్రీరామనవమి రోజు రథయాత్ర అయోధ్య చేరుతుందని తెలిపారు. యాత్రలో భాగంగా ఉదయం 10 గంటలకు ఇందూరు నగరానికి చేరుతుందన్నారు.

రథయాత్రను విహెచ్‌పి ఆద్వర్యంలో స్వాగత ర్యాలీ, మాధవనగర్‌ సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమై పూలాంగ్‌, కలెక్టరేట్‌ మైదానం, రైల్వేస్టేషన్‌, నాందేవ్‌వాడ బ్రిడ్జి, శివాజీ చౌక్‌, దుబ్బ చౌరస్తా మీదుగా విహెచ్‌పి కార్యాలయానికి చేరుతుందన్నారు. మేరు భవన్‌ వద్ద సమావేశం ఉంటుందన్నారు. ర్యాలీలో హిందువులందరు ద్విచక్రవాహనాలతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు తాడూరి ప్రవీణ్‌కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శి కిషన్‌, భజరంగ్‌దళ్‌ విభాగ్‌ సంయోజక్‌ రాజేశ్‌కుమార్‌, జిల్లా సంయోజక్‌ యోగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *