Breaking News

Daily Archives: March 13, 2019

నుడా ఛైర్మన్‌ ఆద్వర్యంలో ఎంపి జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ఆద్వర్యంలో బుధవారం ఎంపి కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని దేవిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించారు. అనంతరం పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు. నుడా కార్యాలయంలో ఛైర్మన్‌ కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌లు రమేశ్‌, అంబాదాస్‌రావు, రాజేంద్రప్రసాద్‌, రాజేశ్వర్‌రావు, నాయకులు బాబురావు, మల్లేశ్‌ యాదవ్‌, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

రెంజల్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి వ్యవస్థాపకులు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినవేడుకలు రెంజల్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవంతుడు కవితక్కకు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బోధన్‌ మార్కెట్‌ కమిటీ ...

Read More »

ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు

ఎడపల్లి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో నిజామాబాద్‌ ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెరాస మండల అధ్యక్షుడు శ్రీరామ్‌, మాజీ సర్పంచ్‌ దశరథ్‌, సొసైటీ డైరెక్టర్‌ శేఖర్‌, రాజు ఆధ్వర్యంలో ఎడపల్లి, జానకంపేట్‌ గ్రామాల్లోని తెరాస పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. అధేవిదంగా ఎంపీపీ రజిత యాదవ్‌, మాజీ సర్పంచ్‌ లతశ్రీ, జైతపూర్‌ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు ,పెన్సిళ్లు, బిస్కెట్లు అన్ని ...

Read More »

ఫామ్‌-6 పనులను వేగవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ వరకు ఓటు నమోదు చేయించుకోవడానికి గడువు ఉన్నందున ఫామ్‌ 6 పనులు వేగంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం బిక్కనూరు, బీబీపేట్‌ తహసీల్‌ కార్యాలయాలను సందర్శించి పాం 6 పనులను పరిశీలించారు. తహసీల్దార్లు ర్యాండమ్‌గా ఓటరు నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేయాలని, బూత్‌ లెవల్‌ అదికారుల పనితీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ఫామ్‌ 6 కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ...

Read More »

దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌

నిజాంసాగర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామంలో నిర్వహించిన సన్నాహక సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలుస్తుందని అన్నారు. మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని అర్జీ పెట్టుకుంటున్నారని అన్నారు. భాజపా కులం పేరుతో, మతం పేరుతో పాలన కొనసాగిస్తోందన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ రైతు బిడ్డ, రైతుల కోసం సంక్షేమ ...

Read More »

16 నుంచి ఎస్‌ఎస్‌సి పరీక్షలు

నిజాంసాగర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 విద్యాసంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3 వరకు కొనసాగుతాయని మండల విద్యాధికారి దేవిసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మండలంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు కేటాయించగా జడ్పిహెచ్‌ఎస్‌ మహ్మద్‌నగర్‌లో 188 విద్యార్థులు, జిహెచ్‌ఎస్‌ నిజాంసాగర్‌లో 266 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మూత్రశాలలు, మెడికల్‌ కిట్‌ తదితర ...

Read More »

సబ్సిడీ రుణాలు నేరుగా మంజూరు చేయాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌, వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతి కోసం వారు ఆర్థికంగా నిలదోక్కుకోవడం కోసం యస్‌.సి. కార్పొరేషన్‌ ద్వారా ఇస్తున్న రుణాలకు సంబంధించి నూతన నిబంధనలను తొలగించి ఫైరవీలకు తావు లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరు చెయ్యాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు సుమన్‌, జిల్లా అధ్యక్షులు కిషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ...

Read More »

పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

ఆర్మూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో గల భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు 50 మంది పోటీలో పాల్గొని వివిధ కళారీతులను గుర్తుచేస్తు రంగు రంగుల ముగ్గులను అలంకరించారు. దేశ రాష్ట్ర, సంస్కతులతో పాటు దేశరక్షణకు నిరంతరం కషి చేస్తున్న సైనికుల త్యాగాలు గుర్తుకు తెచ్చే విదంగా ముగ్గులు వేశారు. వినూత్న రీతిలో ఎక్కడ నిర్వహించని 9 రకాల ఆటలే ...

Read More »

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవికాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఎంపీడీవోలు ఈఓఆర్‌డిలు అధికారులతో త్రాగునీటి ఎద్దడి ఈజీఎస్‌ హరితహారం గ్రామ పంచాయతీ పన్నులు స్థానికసంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరము సాధారణ ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఎండ వేడి వలన నీటి వినియోగం ...

Read More »

ముదురుతున్న ఎండలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గత నాలుగురోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఇప్పటినుంచే ఉక్కపోత బాధ అనుభవిస్తున్నారు. గత నాలుగురోజుల నుంచి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి మార్చి 2వ వారంలోనే ఇలా ఉంటే రానున్న ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్‌గడ్‌ నుంచి ఉపరితల ఆవర్తన ద్రోణి దక్షిణం దిశగా వీయడం ...

Read More »

తప్పతాగి ఎస్‌ఐ వీరంగం

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి తప్పతాగి తన స్నేహితులతో ఒక యువకునిపై దాడిచేసి అతన్ని ఆసుపత్రి పాలు చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈనెల 8వ తేదీన రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నరేశ్‌, అతని స్నేహితులతో కలిసి తాము నివాసముండే ప్రాంతానికి వచ్చి మద్యం సేవిస్తుండగా స్తానిక యువకుడు రంజిత్‌ వారి వద్దకెళ్లి ఇక్కడ కుటుంబాలు నివాసముంటున్నాయని, మద్యం తాగవద్దని కోరారు. దీంతో ఆగ్రహించిన ...

Read More »

ఉజ్వల గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

నిర్మల్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ పట్టణంలోని 9వ వార్డులోని గాంధీచౌక్‌లో బుధవారం ఉజ్వల పథకం కింద హెచ్‌పి గ్యాస్‌ వారి ఆధ్వర్యంలో 21 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్‌ అపర్ణ, ప్రదీప్‌ పాల్గొని లబ్దిదారులకు సిలిండర్లు, స్టౌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ప్రవేశపెట్టిందని, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వీటిని క్షేత్ర స్తాయిలోకి ...

Read More »

కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర శివారులోని రాజారాం స్టేడియంలో జరుగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు బుధవారంతో 9వ రోజుకు చేరినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బుధవారం వెయ్యి మంది పురుష అబ్యర్థులను పిలువగా, అందులోంచి 845 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ...

Read More »

శోభాయమానంగా రామరాజ్య రథయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో బుధవారం రామరాజ్య రథయాత్ర శోభాయమానంగా కొనసాగింది. బుధవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న రథయాత్ర నగర శివారులోని మాధవనగర్‌ నుంచి విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూ సంస్థలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ పూలాంగ్‌, రైల్వే కమాన్‌, శివాజీ చౌరస్తా మీదుగా దుబ్బ ప్రాంతంలోని విహెచ్‌పి కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన త్రిశూల్‌ దీక్షా సభలో శ్రీశక్తి శాంతానంద మహర్షి పాల్గొని ప్రసంగించారు. సంస్కృతి ఒక్కటేనని, బ్రహ్మ, ...

Read More »