Breaking News
సిలిండర్లు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్‌

ఉజ్వల గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

నిర్మల్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ పట్టణంలోని 9వ వార్డులోని గాంధీచౌక్‌లో బుధవారం ఉజ్వల పథకం కింద హెచ్‌పి గ్యాస్‌ వారి ఆధ్వర్యంలో 21 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్‌ అపర్ణ, ప్రదీప్‌ పాల్గొని లబ్దిదారులకు సిలిండర్లు, స్టౌ అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ప్రవేశపెట్టిందని, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వీటిని క్షేత్ర స్తాయిలోకి తీసుకెళితే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి అందుతాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు ప్రదీప్‌, కృష్ణం రాజు, నర్సారెడ్డి, రాజు, గౌతం, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *