Breaking News
వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌

ఫామ్‌-6 పనులను వేగవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ వరకు ఓటు నమోదు చేయించుకోవడానికి గడువు ఉన్నందున ఫామ్‌ 6 పనులు వేగంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం బిక్కనూరు, బీబీపేట్‌ తహసీల్‌ కార్యాలయాలను సందర్శించి పాం 6 పనులను పరిశీలించారు. తహసీల్దార్లు ర్యాండమ్‌గా ఓటరు నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేయాలని, బూత్‌ లెవల్‌ అదికారుల పనితీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ఫామ్‌ 6 కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ వారిగా జాబితాలను పరిశీలన జరపాలని, డుప్లికేట్‌ ఓటరు నమోదు కాకుండా పరిశీలించాలని తెలిపారు. గ్రామంలో ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బిక్కనూరు తహసీల్దార్‌ వెంకన్న, బీబీపేట తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *