Breaking News
ఎంపి కవిత జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు

ఎడపల్లి, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో నిజామాబాద్‌ ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెరాస మండల అధ్యక్షుడు శ్రీరామ్‌, మాజీ సర్పంచ్‌ దశరథ్‌, సొసైటీ డైరెక్టర్‌ శేఖర్‌, రాజు ఆధ్వర్యంలో ఎడపల్లి, జానకంపేట్‌ గ్రామాల్లోని తెరాస పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. అధేవిదంగా ఎంపీపీ రజిత యాదవ్‌, మాజీ సర్పంచ్‌ లతశ్రీ, జైతపూర్‌ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు ,పెన్సిళ్లు, బిస్కెట్లు అన్ని తరగతుల వారికి పంపిణీ చేశారు.

ఈ వేడుకల సందర్భంగా మండల తెరాస నాయకులు మాట్లాడుతూ ఎంపి కవిత నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయూ ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవ చేయాలని మరొక్కసారి తిరిగి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *