Breaking News
మాట్లాడుతున్న పివైఎల్‌ నాయకులు

సబ్సిడీ రుణాలు నేరుగా మంజూరు చేయాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌, వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతి కోసం వారు ఆర్థికంగా నిలదోక్కుకోవడం కోసం యస్‌.సి. కార్పొరేషన్‌ ద్వారా ఇస్తున్న రుణాలకు సంబంధించి నూతన నిబంధనలను తొలగించి ఫైరవీలకు తావు లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరు చెయ్యాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు సుమన్‌, జిల్లా అధ్యక్షులు కిషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

కార్పొరేషన్‌ ద్వారా కార్లు, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ తదితర యూనిట్ల కొరకు సంబంధిత శాఖలవారు నియమించిన నిబంధనలను తొలగించాలని, హైద్రాబాద్‌ ఓలా, వైబర్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కాకుండా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒప్పందాలు పెట్టుకొనేలా చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాకేశ్‌, నిమ్మల నిఖిల్‌లు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *