Breaking News
ఇందూరుకు చేరుకున్న రథయాత్ర

శోభాయమానంగా రామరాజ్య రథయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో బుధవారం రామరాజ్య రథయాత్ర శోభాయమానంగా కొనసాగింది. బుధవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న రథయాత్ర నగర శివారులోని మాధవనగర్‌ నుంచి విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూ సంస్థలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ పూలాంగ్‌, రైల్వే కమాన్‌, శివాజీ చౌరస్తా మీదుగా దుబ్బ ప్రాంతంలోని విహెచ్‌పి కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన త్రిశూల్‌ దీక్షా సభలో శ్రీశక్తి శాంతానంద మహర్షి పాల్గొని ప్రసంగించారు.

సంస్కృతి ఒక్కటేనని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఏ రాష్ట్రం వారైనా ఒకేలా కొలుస్తారని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసమే తాను రథయాత్ర చేపట్టినట్టు తెలిపారు. శైవులు, వైష్ణవులు ఒక్కరేనని రామేశ్వరం శైవ భూమి అని, అయోధ్య వైష్ణవ భూమి అని ఈ రెండూ ఒక్కటేనని తెలియజేయడానికి తాను రామేశ్వరం నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టినట్టు తెలిపారు. యాత్ర ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తు శ్రీరామనవమికి అయోధ్య చేరుతుందని, తాను చేపట్టిన రథయాత్రలో రాజనీతి ఉందని, ఇది సెక్యులరిజం రాజనీతి, కమ్యూనిస్టు రాజనీతి కాదని కేవలం త్రేతాయుగం నుంచి కొనసాగుతున్న శ్రీరామరాజ్యం రాజనీతి ఉందని అన్నారు. కార్యక్రమంలో విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌, హిందూవాహిని, ఆయా హిందూ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *