Breaking News
ముగ్గులు వేస్తున్న విద్యార్థినిలు

పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

ఆర్మూర్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో గల భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు 50 మంది పోటీలో పాల్గొని వివిధ కళారీతులను గుర్తుచేస్తు రంగు రంగుల ముగ్గులను అలంకరించారు. దేశ రాష్ట్ర, సంస్కతులతో పాటు దేశరక్షణకు నిరంతరం కషి చేస్తున్న సైనికుల త్యాగాలు గుర్తుకు తెచ్చే విదంగా ముగ్గులు వేశారు. వినూత్న రీతిలో ఎక్కడ నిర్వహించని 9 రకాల ఆటలే కాకుండా, ఫుడ్‌ ఈటింగ్‌ పోటీలు నిర్వహించడం అనేది విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు.

విద్యార్థులు అన్ని పోటీలలో పాల్గొనాలని గెలుపు, ఓటములు సహజం అన్నారు. ఇందులో భాగంగా భోజన పోటీలను కూడా నిర్వహించారు. పోటీల్లో 70 మంది విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ రఘు నాయుడు, డైరెక్టర్‌ రాజు యాదవ్‌, కళాశాల యాజమాన్యం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *