Breaking News
కేక్‌ కట్‌ చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

రెంజల్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి వ్యవస్థాపకులు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినవేడుకలు రెంజల్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ భగవంతుడు కవితక్కకు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, జిల్లామైనార్టీ నాయకుడు రఫీక్‌, జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌, మండల ప్రధానకార్యదర్శి రాఘవేందర్‌, సర్పంచ్‌ వికార్‌ పాషా, నాయకులు తెలంగాణ శంకర్‌, దత్తుపటేల్‌, గోపాల్‌ రెడ్డి, కుర్మె సాయిలు, పోశెట్టి షబ్బీర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *