Breaking News
పరీక్షల తీరును పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు

కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర శివారులోని రాజారాం స్టేడియంలో జరుగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు బుధవారంతో 9వ రోజుకు చేరినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బుధవారం వెయ్యి మంది పురుష అబ్యర్థులను పిలువగా, అందులోంచి 845 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని కమీషనర్‌ వివరించారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహార శాల, తాగునీరు, మెడికల్‌ బృందాలు, అంబులెన్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో అదనపు డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి, ట్రెయినీ ఐపిఎస్‌ అధికారి గౌస్‌ అలాం, కామారెడ్డి జిల్లా అదనపు ఎస్‌పి అన్యోన్య, ఆర్మూర్‌, బోధన్‌, ఎన్‌ఐబి, ఏఆర్‌, ట్రాఫిక్‌, సిసిఎస్‌, ఏసిపిలు రాములు, రఘు, రాజారత్నం, మహేశ్వర్‌, ప్రభాకర్‌రావు, సత్యకుమార్‌, సబ్‌ డివిజన్‌ల సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *