Breaking News

16 నుంచి ఎస్‌ఎస్‌సి పరీక్షలు

నిజాంసాగర్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 విద్యాసంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3 వరకు కొనసాగుతాయని మండల విద్యాధికారి దేవిసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మండలంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు కేటాయించగా జడ్పిహెచ్‌ఎస్‌ మహ్మద్‌నగర్‌లో 188 విద్యార్థులు, జిహెచ్‌ఎస్‌ నిజాంసాగర్‌లో 266 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మూత్రశాలలు, మెడికల్‌ కిట్‌ తదితర ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎంఇవో పేర్కొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *