Breaking News

ముదురుతున్న ఎండలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గత నాలుగురోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఇప్పటినుంచే ఉక్కపోత బాధ అనుభవిస్తున్నారు. గత నాలుగురోజుల నుంచి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి మార్చి 2వ వారంలోనే ఇలా ఉంటే రానున్న ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్‌గడ్‌ నుంచి ఉపరితల ఆవర్తన ద్రోణి దక్షిణం దిశగా వీయడం మూలంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వారు తెలిపారు.

కావున ప్రజలు ఉదయమే తమ పనులు ముగించుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు ఎండదెబ్బ తగలకుండా వదులు దుస్తులు ధరించాలని, అన్ని ప్రభుత్వ హెల్త్‌ సెంటర్లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులోకి తెస్తున్నామని వీటిని దగ్గరుంచుకుంటే ముందస్తు జాగ్రత్త వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండలు ఎక్కువ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా మొదలైంది. జిల్లా యంత్రాంగం గత రెండు సంవత్సరాలుగా తాగునీటి సమస్యపై ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా గత వర్షాకాలం సరైన వర్షాలు లేకపోవడంతో ఈ వేసవిలో తాగునీటి సమస్య తప్పేలా లేదని పలువురు భావిస్తున్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *