Breaking News
ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కెటిఆర్‌

దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌

నిజాంసాగర్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామంలో నిర్వహించిన సన్నాహక సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలుస్తుందని అన్నారు. మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని అర్జీ పెట్టుకుంటున్నారని అన్నారు. భాజపా కులం పేరుతో, మతం పేరుతో పాలన కొనసాగిస్తోందన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ రైతు బిడ్డ, రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేపడతారన్నారు.

సభకు హాజరైన జనం

ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా కేసీఆర్‌ కుటుంబం ఆస్తులు పోగొట్టుకున్నారని, గోదావరి జలాలతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నింపితే రైతుకు పంటలు పుష్కలంగా పడుతాయని అన్నారు. కోటి ఎకరాల మాగాణియే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కెటిఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చాక రైతుల సమస్యలు తొలిగిపోయాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రైతులను విస్మరించారని ధ్వజమెత్తారు. రైతులకు నిరంతరం విద్యుత్‌ ఇస్తున్న ఘనత కెసిఆర్‌దేనని, తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని పేర్కొన్నారు. ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నామని, వచ్చే నెల నుండి వద్ధులకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్‌ రెండు వేల పది రూపాయలు ఇస్తామని, తెలంగాణ ప్రజలు తెరాసకు రెండోసారి పట్టం కట్టారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు లేని పోనీ మాటలు మాట్లాడుతున్నారని, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన మోడీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు కల్పించలేదని విమర్శించారు.

కెటిఆర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న నాయకులు

80 వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మిస్తున్నామని, త్వరలో కాళేశ్వరం నీటితో నిజాంసాగర్‌, సింగూర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండు కుండల వుంటాయని తెలిపారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు 5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని విమర్శించారు. మోడీ తెలంగాణకు మొండి చేయి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌, భాజపా కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌, కార్తి కిరణ్‌, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌, అసోద్దీన్‌, ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్మన్‌ ధపెదర్‌ రాజు, సీడిసి చైర్మన్‌ దుర్గరెడ్డి, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు గైని విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *