Breaking News
వీడియో కాన్పరెన్సులో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవికాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఎంపీడీవోలు ఈఓఆర్‌డిలు అధికారులతో త్రాగునీటి ఎద్దడి ఈజీఎస్‌ హరితహారం గ్రామ పంచాయతీ పన్నులు స్థానికసంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరము సాధారణ ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఎండ వేడి వలన నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గ్రామపంచాయతీ ఆవాస గ్రామాల్లో తండాల్లో నీటి ఎద్దడి ఉన్నదని ఫిర్యాదులుగాని ఆరోపణలుగాని రాకుండా ప్రణాళికతో ముందుకుపోవాలని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ప్రజలు ధర్నాలు ఆందోళనలు చేసిన పక్షంలో సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటి నుండే జూలై చివరి వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రణాళికలు తయారు చేసుకోవాలని సమస్య వచ్చినప్పుడే పరిష్కరించడం కాకుండా ముందస్తుగానే ఏ గ్రామాల్లో ఎప్పటినుండి ఎద్దడి ఉంటుందో గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని గ్రామ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అలసత్వం నిర్లక్ష్యం చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదని చెప్పారు.

మిషన్‌ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవోలు గ్రామాలకు స్వయంగా వెళ్లి బల్క్‌ వాటర్‌ సరఫరా ఏవిధంగా ఉందో ఇంట్రా విలేజ్‌ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్లు వివరాలు బల్క్‌ వాటర్‌ రోజువారీగా సరఫరా చేస్తున్నారా లేదా ఎంత క్వాంటిటీ సరఫరా చేస్తున్నారు స్వయంగా ఎంపీడీవోలు పరిశీలన చేయాలని చెప్పారు త్రాగు నీటి ఎద్దడి విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమస్య పరిష్కరించలేని సందర్భంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా అధికారులకు నివేదించ కుండా సాధ్యమైనంత మేరకు అక్కడికక్కడే పరిష్కరించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నులను వసూలు చేయాలని జిల్లాలో 29 కోట్ల పనులను వసూలు చేయ లక్ష్యం కాగా వసూళ్లలో జిల్లా వెనుకబడి ఉందని ప్రతిరోజు కోటి నుండి కోటిన్నర వరకు వసూలుచేయాలని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలకు పదే పదే ఆదేశాలు జారి చేస్తున్నప్పటికీ గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లు ఉండడం లేదని కొన్ని గ్రామ పంచాయతీలలో సానిటేషన్‌ సిబ్బంది ఉన్న కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఎడ్యుకేట్‌ చేసి గ్రామాలలో పరిశుభ్రంగా ఉండేందుకు ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పొడి తడి చెత్త వేరు వేరు చేసి డంపింగ్‌ యాడ్కు తరలించాలని వైకుంఠ దామం నిర్వహణ చెత్తను కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో 40 వేల నుండి ఒక లక్ష మొక్కలను పెంచే నర్సరీలను ఏర్పాటు చేసినందున గ్రామపంచాయతీ లక్ష్యం మేరకు మొక్కలను తయారుచేయాలని గత సంవత్సరం కంటే మూడు రేట్లు ఎక్కువగా టార్గెట్‌ ప్రకారంగా మొక్కలను నాటాలని నాటడంతో పాటు గా సంరక్షణ కూడా చేయాలని ఇది గ్రామ సర్పంచ్‌ బాధ్యత చట్టంలో రూపొందించినందున ఎంపీడీవోలు సర్పంచులకు తగు సూచనలు జారీ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో కూడా నర్సరీలను ఏర్పాటు చేయాలని అన్నారు.

వీడియో కాన్పరెన్సులో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ఉపాధిహామీ కార్యక్రమంలో జిల్లా యొక్క లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ పనులు లేనందున కూలీలను సంఖ్యను పెంచి అదేవిధంగా పని దినాలు పెరిగే విధంగా అర్హులైన వారందరికీ పని కల్పించాలని ఈసారి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఎండ దెబ్బ తగలకుండా తక్కువగా ఉన్న సమయంలో పనులను చేయించాలని పనివద్ద టెంటు ఓఆర్‌ఎస్‌ త్రాగునీరు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్‌పిటిసి ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్‌ జారీ కావచ్చునని దాన్ని దష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆర్‌ఓ, ఏఆర్‌ఓ నియామకము జోన్స్‌, రూట్‌ మ్యాప్లను తయారుచేయాలని 600 ఓట్ల కంటే ఎక్కువగా ఉండకుండా ఒక పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆ విధంగా ఓటరు జాబితా ప్రకారంగా పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని దానికి అనుగుణంగా అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను పింక్‌ వైట్‌ కలర్‌లో బ్యాలెట్‌ పేపర్‌ సిద్ధం చేసుకోవాలని, ఎన్నికలలో ఈవిఎంలను వాడే అవకాశం కూడా ఉందన్నారు. ఓటర్‌ జాబితాలో బోగస్‌ డూప్లికేట్‌ లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జడ్పీ సీఈవో వేణు, డీపీవో కష్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *