Breaking News

Daily Archives: March 14, 2019

తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మూెత్సవాలు

బాన్సువాడ, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామశివారులో తెలంగాణ తిరుమల అలయంలో బ్రహ్మూెత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి భజనలతో కీర్తనలతో స్వామివారికి అభిషేకాలు, అనంతరం అన్నదానం నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెరువులో బోటు ఏర్పాటు చేస్తామని, హెలిప్యాడ్‌ స్టాండ్‌ కావడానికి స్థలము ఏర్పాటు చేయడం, భక్తులకు మరుగుదొడ్లు నిర్మాణం చేస్తామని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మూెత్సవాలకు తరలివచ్చారు. శ్రీవారి కల్యాణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ...

Read More »

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. గురువారం రెంజల్‌ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళా దినోత్సవం ప్రాముఖ్యత ప్రపంచంలోని మహిళలు సాధించిన విషయాలను వివరించారు. మహిళలు మునుముందు మరింత అభివద్ధి చెంది మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. సమాజంలో ...

Read More »

ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

మోర్తాడ్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. 25 మంది తెరాస కార్యకర్తలు రక్తదానం చేసినట్టు ఏర్గట్ల మండల పార్టీ అధ్యక్షుడు రాజాపూర్ణానందం తెలిపారు. అలాగే గ్రామంలో మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల ఉమ్మడి జడ్పిటిసి ఎనుగందుల అమిత కేక్‌కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే ...

Read More »

తైబజార్‌ వేలం

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన సాటాపూర్‌ తైబజార్‌ వేలంను గురువారం సర్పంచ్‌ వికార్‌ పాషా, కార్యదర్శి రఘురాం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. వివిద గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. 10 లక్షల 12 వేల రూపాయలకు సాటాపూర్‌ గ్రామానికి చెందిన మునీర్‌ అనే వ్యాపారస్తుడు తైబజార్‌ను వేలంలో పొందారు. తైబజార్‌ కాలపరిమితి ఒక సంవత్సర కాలానికి సంబంధించినదని కార్యదర్శి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, కార్యదర్శి ...

Read More »

మహిళలకు పోషక లోపాలు లేకుండా చూడాలి

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు, మహిళలకు పోషకాలలో లోపాలు లేకుండా చూడాలని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల అన్నారు. శిశుసంక్షేమ శాఖ ఆద్వర్యంలో పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఐసిడిఎస్‌ ఆద్వర్యంలో అంగన్‌వాడి కేంద్రాల్లో పోషణ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. కిషోర బాలికలకు పోషకాహారంపై అవగాహన నిర్వహించి బాల్య వివాహాలు విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు తప్పక పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా ...

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులను, జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమావేశం నిర్వహించడంతో పాటు, జిల్లా కలెక్టర్లతో విడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులు కొనసాగించాలని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు కోసం కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త ప్రెసిడెన్షల్‌ ...

Read More »

ఆదరించండి అండగా ఉంటా

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న కరీంనగర్‌, మెదక్‌ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టబద్రుల నియోజక ఎమ్మెల్సీ స్థానానికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని రుద్రమా గోగుల కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యమ కారిణిగా, పాత్రికేయురాలిగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను నిర్వహించిన పాత్ర తెలిసిందేనన్నారు. ఎంసీఏ పూర్తి చేసిన తాను సాఫ్ట్వేర్‌ రంగంలో అనేక అవకాశాలున్నా జర్నలిజంపై మక్కువతో ఎంసీజే పూర్తి చేశానని, ప్రజా జీవితంలోకి ...

Read More »

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురేశ్‌ రెంజర్ల

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది సురేశ్‌ రెంజర్ల కోరారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని పట్టభద్రులను కోరారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సెక్షన్‌ 41-ఎ, సిఆర్‌.పిసి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయించే విధంగా లేదా రద్దుచేయించే విధంగా కృషి చేస్తానని ఆయన ...

Read More »

కొనసాగుతున్న దేహదారుఢ్యపరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచన మేరకు నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం స్టేడియంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు గురువారంతో పదవ రోజుకు చేరినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. పదవరోజు వెయ్యి మంది అభ్యర్థులకు గాను 910 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమీషనర్‌ వెల్లడించారు. పరీక్షల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రీడర్‌ ప్యాడ్‌లను ఉపయోగించడం ద్వారా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, ...

Read More »

నిందితుల అరెస్టు

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13వ తేదీన అర్ధరాత్రి బాల్కొండ, ముప్కాల్‌ మండల కేంద్రాల్లో వైన్స్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. వారి వద్దనుంచి రూ.13 వేల విలువగల నాణేలు స్వాధీన పరుచుకున్నట్టు వివరించారు. కేసులో ముప్కాల్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా నేర పరిశోధన చేసి నిందితులను 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారని సిపి పేర్కొన్నారు. నేరస్తులు మహ్మద్‌ ఖలీల్‌ (20), మహ్మద్‌ అహ్మద్‌ ...

Read More »